Pakistan: పాకిస్తాన్‌లో భారీగా పెరిగిన బంగారం ధర.. వామ్మో.. ఎంతో తెలుసా?

ప్రపంచకప్‌లో ఒకచోట ఒకలా ధరలు ఉంటాయి. ఏ వస్తువు తీసుకున్నా.. ఒక దేశంలో ఒకలా ఉంటాయి.

  • Written By:
  • Updated On - March 4, 2023 / 01:58 AM IST

Pakistan: ప్రపంచకప్‌లో ఒకచోట ఒకలా ధరలు ఉంటాయి. ఏ వస్తువు తీసుకున్నా.. ఒక దేశంలో ఒకలా ఉంటాయి. ఒక దేశంలో తక్కువగా, ఒక దేశంలో ఎక్కువగా ఉంటాయి. ఆ దేశం, రాష్ట్రం విధించే ట్యాక్స్‌ల ప్రకారం ప్రతీ దేశంలో, రాష్ట్రంలో వస్తువుల ధరలు ఆధారపడి ఉంటాయి. పర్యటనలకు ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ తక్కువకు లభించే వస్తువులను తెచ్చుకుకంటూ ఉంటారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ కు బాగా డిమాండ్ ఉంటుంది. గోల్డ్ ధరించేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా గోల్డ్ పై ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేస్తూ ఉంటాయి. ధరించడానికి కూడా ఇన్వెస్ట్ మెంట్ కూడా గోల్డ్ ను భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ లో గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. పాకిస్తాన్ ద్రవ్యోల్బణం 50 ఏళ్ల గరిష్టానికి చేరింది. దీంతో ధరలన్నీ పెరుగుతున్నాయి.

అలాగే గోల్డ్ ధరలు కూడా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర 2.06 లక్షల పాకిస్తాన్ రూపాయాలకు చేరింది. ఇక అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. లీటర్ డీజిల్ ధర రూ.280కి చేరుకుంది. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను 300 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో రుణ వడ్డీ రేటు 20 శాతానికి చేరింది.

ఇక పాకిస్తాన్ అప్పు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంక పరిస్ధితే పాకిస్తాన్ కు కూడా వస్తుందని అంటున్నారు. దేశంలో ఉత్పత్తి చేసే ఇతర మెడిసిన్ ముడి సరుకు సైతం దిగుమతి చేసుకోలేని స్థితిలో పాకిస్తాన్ ఉంది.