Health Tips : ఆవు పాలకి, బర్రె పాలకి మధ్య తేడా ఏంటీ.. ఏ పాలతో ఎక్కువ లాభం?

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూట చాలామంది పాలు తాగుతూ ఉంటారు. అయితే ఈ పాలలో ఎన్నో రకాల పోషకాలు

  • Written By:
  • Publish Date - August 14, 2022 / 08:15 AM IST

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూట చాలామంది పాలు తాగుతూ ఉంటారు. అయితే ఈ పాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. పాలలో విటమిన్ డి తో పాటు కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే వైద్యులు ప్రతిరోజు కూడా పాలు తాగాలి అని చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది ఆవుపాలని ఇష్టపడితే మరి కొంతమంది గేదె పాలను ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలామందిని ఆలోచింపజేసే ప్రశ్న ఏమిటంటే ఆవు పాలు మంచివా?లేకపోతే గేదె పాలు మంచివా? మరి ఈ ఆవుపాలకు గేదె పాలకు మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాల‌ల్లో ఉండే కొవ్వు పై వాటి చిక్క‌ద‌నం ఆధార‌ప‌డి ఉంటుంది. ఆవు పాల‌ల్లో 3 నుంచి 4 శాతం మాత్ర‌మే కొవ్వు ఉంటుంది. అదే బ‌ర్రె పాలల్లో 7నుంచి 8 శాతం వ‌ర‌కు కొవ్వు ఉంటుంది. అందుకే ఆవు పాల కంటే బ‌ర్రె పాలు చిక్క‌గా ఉంటాయి. అందువల్ల ఆవు పాలు తొందరగా జీర్ణం అవగా,బ‌ర్రెపాలు అర‌గ‌డానికి కాస్త ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.అలాగే ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో 10-11 శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఇవి ఎక్కువ‌గా వేడి నిరోధ‌క‌త‌ను క‌లిగి ఉంటాయట. అందువల్లే న‌వ‌జాత శిశువులు, వృద్ధుల‌కు బ‌ర్రె పాలు తాగించకూడదు అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటుంది.

అందువ‌ల్ల ఊబ‌కాయం, ర‌క్త‌పోటు, కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డేవారు ఆవు పాల‌కు బ‌దులు బ‌ర్రె పాలు తాగ‌డం మంచిది. అలాగే ఆవుపాల‌తో పోలిస్తే బ‌ర్రె పాలల్లోనే కేల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. కేల‌రీల‌తో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఒక‌ గ్లాస్ బ‌ర్రె పాల‌ల్లో 237 కేల‌రీలు ఉంటే,ఒక గ్లాస్ ఆవు పాల‌ల్లో 148 కేల‌రీలు మాత్ర‌మే ఉంటాయి. ఇక ఆవుపాలతో పోలిస్తే బర్రె పాలు ఎక్కువ సమయం నిల్వ. అయితే ఆవు పాలను రెండు రోజులలోపే తాగేయాలి. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. బర్రె పాలు తెలుపు రంగులో ఉంటాయి. ఆవు పాలల్లో బీటాకెరోటిన్ ఉంటుంది. మంచి నిద్ర పోవాలంటే రాత్రి పూట బ‌ర్రె పాలు తాగ‌డం మంచిది. కోవా, పెరుగు, నెయ్యి ప‌న్నీర్‌, పాయ‌సం వంటివి చేయ‌డానికి బ‌ర్రె పాలు మంచివి. అదే ఆవు పాలల్లో త‌క్కువ క్రీమ్ ఉంటుంది కాబ‌ట్టి స్వీట్ల తయారీకి వీటిని ఉప‌యోగించ‌వచ్చు. అయితే మొత్తం గా చూసుకుంటే ఆవుపాలు బర్రె పాలు రెండు మంచివే. కావని అవసరాలను బట్టి మనం పాలు కావాలా, బర్రె పాలు కావాలా అని నిర్ణయించుకుని తాగాలి.