Site icon HashtagU Telugu

WebSites Hacking: రోజుకు ఎన్ని కోట్ల వెబ్ సైట్స్ హ్యాక్ అవుతున్నాయో తెలుసా!

Hacked

Hacked

WebSites Hacking: డిజిటల్ రాకతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారుపోతున్న తరుణంలో వెబ్ సైట్స్ సైతం పుట్టుకొస్తున్నాయి. అయితే రోజుకి 70వేల వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురవుతుంటాయని ఇంగ్లండ్‌ కు చెందిన ఇంటర్నెట్‌ సంస్థ నెట్‌ క్రాఫ్‌ తాజా నివేదికలో వెల్లడించింది. నిమిషానికి 175 పుడుతున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త వెబ్ సైట్లు పుడుతున్నాయి. అంటే కొత్త డొమైన్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనమాట. వీటిలో ఎన్ని పూర్తి స్థాయిలో వెబ్ సైట్స్ గా రూపు దిద్దుకుంటాయనేది ప్రశ్నార్థకమే.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల వెబ్ సైట్లు ఉన్నాయని అంచనా. వాటిలో కేవలం 18 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. అంటే 2029 కోట్ల వెబ్ సైట్లు మాత్రమే ప్రస్తుతం తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 1991లో ఒక్క వెబ్ సైట్ తో ప్రారంభమైన ఇంటర్నెట్.. ఇప్పుడు 100కోట్లకు పైగా వెబ్ సైట్లకు వేదికగా మారింది. దాదాపు 71 శాతం మంది తమ వ్యాపారాలను వెబ్‌ సైట్లపై ఆధారపడి నిర్వహిస్తున్నారు. ఇందులో 28 శాతం ఆన్‌ లైన్‌ వ్యాపారం నడుస్తోంది. రోజుకి 200 కోట్ల మందికి పైగా కస్టమర్లు వివిధ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. బ్రౌజింగ్ లో గూగుల్ దే టాప్ కావడం గమనార్హం.

Exit mobile version