PM Kisan: పీఎం కిసాన్ ద్వారా ఎన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందతున్నారో తెలుసా

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 11:14 AM IST

PM Kisan: రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను ఫిబ్రవరి 28న జమ చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. రూ.21వేల కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మందికి రైతులకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది.

దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ‘నమో షేత్కారీ మహాసమ్మన్ నిధి’ రెండో, మూడో విడత నిధులను సైతం ప్రధాని పంపిణీ చేయనున్నారు. దీంతో మహారాష్ట్రవ్యాప్తంగా దాదాపు 88 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో భాగంగా ఏడాదికి రూ.6వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున సాయం విడుదల చేస్తూ వస్తోంది.ఇప్పటి వరకు మొత్తం 15 విడతలలో సమ్మాన్ నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేసింది.

ఇక 16వ విడత సహాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా గతేడాది నవంబర్‌ 15న ప్రధాని 15వ విడతలో 8 వేల కోట్లకుపైగా రైతులకు రూ.18వేల కోట్లు జమ చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు