Site icon HashtagU Telugu

Portugal: ఈ ఇల్లు బాగా ఫేమస్ గురూ.. ఆ ఇంటి ప్రత్యేకత ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Portugal

Portugal

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చాలామంది అనేక ఆధ్యాత్మిక హంగులతో ఇళ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భూగర్భ జలంలో ఆకాశంలో చెట్లపై ఇలా అనేక ప్రదేశాలలో మించిన ఇళ్ళను ఇప్పటికే మనం చూసేఉంటాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక ఇల్లు మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఆ ఇంటిని చూడడానికి టూరిస్టులు క్యూలు కడుతున్నారు. మరి ఆ ఇంటి ప్రత్యేకత ఏమిటి? టూరిస్టులు చూపెడుతున్న ఆ ఇంటిని దేనితో నిర్మించారు. అసలు ఆ ఇల్లు ఎక్కడ ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం కలుసుకుందాం..

కాగా ప్రస్తుతం మనకు ఫోటోలో కనిపిస్తున్నది శిలాగృహం. ఆ ఇంటిని చూసి పొరపాటున ఇదేదో రాతియుగం నాటిది అనుకునేరు. అచ్చంగా నేటి కాలంలో నిర్మించినదే. ఈ ఇల్లు పోర్చుగల్‌లోని గిమెరెస్‌లో ఉంది. కొండ ప్రాంతంలో ఒకదానినొకటి అతుక్కుని ఉన్న నాలుగు భారీ శిలలను తొలిచి ఈ ఇంటిని నిర్మించారు. ఒక స్థానిక ఇంజినీర్‌ ఫామ్‌ హౌస్‌లా ఉపయోగించుకునేందుకు దీనిని 1972లో నిర్మించుకున్నాడు. విచిత్రమైన ఈ నిర్మాణాన్ని చూడటానికి జనాల తాకిడి రోజు రోజుకి ఎక్కువ కావడంతో, దీని యజమాని వేరేచోట ఫామ్‌ హౌస్‌ను నిర్మించుకుని తరలిపోయాడు.

Portugal 1

ఇందులోని ఫర్నిచర్‌ని, ఇతర వస్తువులను అలాగే ఉంచేసి, దీనిని మ్యూజియంలా మార్చడంతో, ఈ కట్టడం పోర్చుగల్‌లో పర్యాటక ఆకర్షణగా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైన కట్టడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నిత్యం అక్కడికి వేలాది సంఖ్యలో టూరిస్టులు వస్తున్నట్లు సమాచారం.