Tulsi Plant: ఆదివారం తులసిచెట్టుకు నీళ్లు పోయకూడదు..ఎందుకో తెలుసా..?

భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో తులసిమొక్క ఉంటుంది.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 06:32 AM IST

భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో తులసిమొక్క ఉంటుంది. హిందువులు దేవుడిని ఎంతలా పూజిస్తారో…అదేవిధంగా తులసి చెట్టును కూడా పూజిస్తారు. దైవ సమానంగా భావిస్తారు. తులసి చెట్టును సాక్ష్యాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి చెట్టుకు పూజలు చేస్తే సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం చాలామంది తులసి మొక్కకు దీపారాధన చేయడంతోపాటు నీళ్లు పోస్తుంటారు. అయితే తులసి మొక్క విషయంలో చాలా నియమాలు పాటించాలి. ముఖ్యంగా తులిసి చెట్టుకు నీరు పోసేటప్పుడు చాలామంది వారికి తోచిన సమయాల్లో పోస్తుంటారు.

అయితే తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎప్పుడు నీళ్లు పోయాలి…ఎప్పుడు తులసీని పూజించాలి తెలుసుకుందాం.

ప్రతిరోజూ సాయంత్రం చాలా మంది తులసి మొక్కు నీరు పోసి పూజిస్తుంటారు. సంధ్యాసమయంలో తులసి మొక్కకు నీరు పోయకూడదు. సాయంత్రం తులసి మొక్క కింద విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేదతీరుతూ ఉంటారని..అందుకే ఆ సమయంలో తులసీ మొక్కకుక నీరు పోయకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా పౌర్ణమి అమావాస్య, సూర్య చంద్ర గ్రహణాల సమయంలో కూడా తులసీ చెట్టుకు నీళ్లు పోయకూడదు. ఇక పెరట్లోని తులసి మొక్కకు ఎండిన ఆకులు ఎక్కువగా ఉన్నట్లయితే..ఆ మొక్కను తీసి ఎవరూ తిగని చోట వదిలివేయాలి. ఆ స్థానంలో మరో కొత్త మొక్కను నాటాలి. ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో అశుభాన్ని సూచిస్తుందని పండితులు చెబుతుంటారు. ఇక శాస్త్రప్రకారం అదివారం ఏకాదశి రోజుల్లో తులసి చెట్టును పొరపాటును తాకకూడదు. నీరు పోయకూడదు. అయితే ఆ రోజు తులసి మొక్కకు పూజ చేయడం శుభప్రదం. చాలామంది తులసి ఆకులను గోళ్లతో గిల్లుతారు. స్నానం చేయకుండా అస్సలు తులసి మొక్కను తాకరాదు. అలా చేస్తే కుటుంబంలో చికాకులు తప్పవని పురాణాల్లో ఉంది.