Site icon HashtagU Telugu

Bunny Vasu: తప్పుడు ఆరోపణలు నమ్మొద్దు: నిర్మాత బన్నీ వాస్

Bunny Vasu

Bunny Vasu

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్‌ పై గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆయన స్పందించారు. ‘‘సునీత బోయ అనే అమ్మాయి తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయంపై కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి.. అంటే 2019 నుంచి ఇప్పటి వరకు సునీత బోయ.. గీతా ఆర్ట్స్ సంస్థ.. అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. ఆమె సమాజంలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకునేది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు హెడ్ లైన్స్‌లో ఉండటానికి.. కావాలనే వివాదాస్పద విషయాల్లో వేలు పెట్టడం.. వాటికి సంబంధించిన డిబేట్స్‌లో పాలు పంచుకోవడం చేస్తుంది. ఈమెకు ముందు నుంచి కూడా అలవాటు ఇది. దీనికి ఆధారాలు కావాలంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఆమె పోస్ట్‌లు, యూట్యూబ్ లింక్‌లను చూడవచ్చు.

ఇలాంటి పనులు ముందు నుంచే చేస్తున్న సునీత.. దాదాపు అన్నింట్లోనూ విజయం సాధించింది. ఒక్క గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్ గారి విషయంలో తప్ప. వాళ్లు ఈమె బెదిరింపులకు, అబద్ధపు ఆరోపణలకు లొంగలేదు.. బెదరలేదు. సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమై ఉంటుందేమో అనే జాలితో వదిలేసారు. అయితే ఆమెకు పరిస్థితులను జీర్ణించుకోవడం కష్టంగా మారింది. ఆరోపణల విషయమై  HRCతో పాటు సంబంధిత గౌరవ విచారణ, జిల్లా హైకోర్టులలో ఈమెకు వార్నింగ్స్ వచ్చాయి. అయినా కూడా పట్టించుకోకుండా అలాగే ఆరోపణలు చేస్తుంది. దీని వెనుక ఉన్న వ్యక్తులపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని బన్నీవాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.