DK Sivakumar: డీకే కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

కాంగ్రెస్ కర్ణాటక విభాగం అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Sivakumar) పెద్ద ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు.

Published By: HashtagU Telugu Desk
Dk

Dk

కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ (DK Sivakumar) పెద్ద ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. మంగళవారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాక్‌పిట్ గ్లాస్‌కు గాలిపటం ఢీకొట్టడంతో హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కోలార్ జిల్లా ముల్బాగల్ బహిరంగ సభకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ నాయకుడు వెళ్తున్నారు.

బెంగుళూరులోని జక్కూర్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ఎగిరింది. కానీ గాలిపటం ఢీకొట్టడంతో వెంటనే అత్యవసర ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్‌ను (Helicopter)  హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ అద్దం పగిలింది.  డీకే శివకుమార్ (DK Sivakumar), పైలట్‌తో పాటు ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్న ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టు హెలికాప్టర్‌లో ఉన్నారు. వారంతా క్షేమంగా ఉన్నారు. అయితే ఆయన హెలికాప్టర్ ను గద్దను ఢీకొన్నట్టు మరికొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపరిపీల్చుకున్నాయి.

Also Read: Salman Khan: సల్మాన్ సంచలనం.. ఇక సినిమాలకు గుడ్ బై!

  Last Updated: 02 May 2023, 05:46 PM IST