Dasoju Sravan: డీకే శివకుమార్‌ ఓ CBI కేసులో దొంగ: దాసోజు శ్రవణ్

తోడు దొంగలు తెలంగాణని దోచుకోవడానికి వచ్చిన తోడేళ్ళు అని బిఆర్ఎస్ సీనియర్ నేత డా. శ్రవణ్ దాసోజు అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Dasoju Sravan Counter to Kishan Reddy

Dasoju Sravan Counter to Kishan Reddy

Dasoju Sravan: డీకే శివకుమార్‌ ఓ CBI కేసులో దొంగ. ఓటుకు నోటు, సీటుకు నోటు గజ దొంగ రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు తోడు దొంగలు తెలంగాణని దోచుకోవడానికి వచ్చిన తోడేళ్ళు అని బిఆర్ఎస్ సీనియర్ నేత డా. శ్రవణ్ దాసోజు అన్నారు. కెసిఆర్ చేసిన అభివృద్ధి పై డీకే శివకుమార్‌ మాటలు వింటే గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించిదనే సామెతలా వుంది. కర్ణాటకలో ఒక్క పధకం కూడా అమలు చేయని డీకే.. ఏ మొహంతో సిగ్గులేకుండా తెలంగాణ గురించి మాట్లాతుండు అని ప్రశ్నించాడు. ఉచిత కరెంట్ విషయంలో డీకే శివకుమార్‌ స్వయంగా దొంగలా పట్టుబడ్డారు. తాము ఐదు గంటల కరెంటే ఇస్తున్నామని స్వయంగా డీకే శివకుమార్‌ చెప్పడం తెలంగాణ సమాజం అంతా ప్రత్యేక్షంగా చూసిందని. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా ? కేవలం ఐదు గంటలు, మూడు గంటలు పవర్ ఇస్తామన్నా రేటేంత కాంగ్రెస్ కావాలా ? కర్ణాటక కాంగ్రెస్ కావాలా ? తెలంగాణ సమాజం లోతుగా అలోచించాలని దాసోజుల అన్నారు.

‘‘ నరకకూపమైన ట్రాఫిక్ సమస్యలతో గార్డెన్ సిటీ అయిన బెంగుళూరు ను గార్బేజ్ సిటీగా మార్చిన ఘనత కాంగ్రెస్ ది. అడ్డగోలుగా కమీషన్స్ తింటూ, పాలనని గాలికోదిలేసిన డీకే ఏం మొహం పెట్టుకొని తెలంగాణ గురించి మాట్లడుతున్నారు ? అసలు మీకు సిగ్గుందా ? డీకే శివకుమార్‌, మల్లికార్జున్ ఖర్గే లాంటి నాయకులు తీర్ధయాత్ర చేసే పొలిటికల్ టూరిస్ట్ లా ఇక్కడికి వచ్చి తెలంగాణ అభివృద్ధి చూడండి. తెలంగాణ అభివృద్ధి నమూనాని నేర్చుకోండి. కర్ణాటక రాష్ట్రాన్ని ఆదుకోండి. సొంతపార్టీ ఎమ్మెల్యే గా పోటి చేయాలంటే దానికి రేట్ కార్డ్ పెట్టిన నాయకుడు రేటెంత రెడ్డి. సొంత పార్టీ నాయకులకే టికెట్లు అమ్ముకునే నాయకుడు.. రాష్ట్రాన్ని ఏ రకంగా అమ్మకుతింటాడో ప్రజలు దయచేసి అర్ధం చేసుకోవాలి’’ దాసోజు అన్నారు.

‘‘నమ్మకం అంటే బిఆర్ఎస్. అమ్మకం అంటే కాంగ్రెస్. నమ్మకమైన బిఆర్ఎస్ ని మళ్ళీ నిలబెట్టుకుందాం. తోడేళ్ళు, నక్కలు, మిడతల దండులా వచ్చి దాడి చేసి తెలంగాణని దోచుకుతినాలని ప్రయత్నిస్తున్న రేటెంత రెడ్డి, డికే శివకుమార్ లాంటి గజదొంగలకు సరైన గుణపాఠం చెబుదాం. ‘డీకే శివకుమార్‌ దేశంలో అతిపెద్ద దోపిడీదారుడు. సిబిఐ రైడ్ లో వేలకోట్ల రూపాయిల అక్రమ సొమ్ముతో పట్టుబడ్డ వైట్ కాలర్ ఫ్రాడ్, క్రిమినల్. అలాంటి గజదొంగని పక్కన పెట్టుకొని ఓటుకు నోటు దొంగ, ఇప్పుడు సీటుకు నోటు దొంగ, బ్లాక్ మెయిలర్, భూకబ్జాకోరైన రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరి పక్కపక్క చూస్తుంటే తెలంగాణని దోచుకుతినడానికి సిద్ధమైన తోడేళ్ళులా కనిపిస్తున్నారు” అని మండి బిఆర్ఎస్ సినియర్ నేత డా.దాసోజు శ్రవణ్. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్‌షోల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు డా.దాసోజు

  Last Updated: 30 Oct 2023, 11:19 AM IST