DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ పుట్టిన రోజునే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్న చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేంద్రం నుంచి నిధులు లేకుండా ఈ ప్రభుత్వం ఇళ్లు నిర్మించగలదా? అని ప్రశ్నించారు డీకే అరుణ. రైతులకు రుణమాఫీ కార్యక్రమాలలో 50 శాతం మందికి కూడా నిధులు అందలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో డీకే శివకుమార్ ‘ఫ్రీ బస్’ ఇవ్వాలని చెప్పిన విషయం గుర్తు చేస్తూ, గ్రామాలకు బస్సులు నిలిపి పెట్టి ఫ్రీ బస్‌లు ఇస్తామంటున్నారని అన్నారు.
AP Assembly Sessions : నవంబర్ 11 నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు
రేవంత్ రెడ్డి ‘అన్నీ అమలు చేస్తున్నాం’ అని చెప్పడానికి సిగ్గు ఉండాలన్నారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలను సమర్ధంగా వివరించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీపై మాట్లాడుకుంటే, రూ.500ల కొరకు సిలిండర్ కొనేందుకు 375 రూపాయలు కేంద్రం చొప్పిస్తున్నది, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో చెప్పాలని డీకే అరుణ కోరారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వమే అందిస్తున్నదని చెప్పారు. ప్రజలను భ్రమలో ఉంచకుండా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డీకే అరుణ అన్నారు. ప్రజలు మేల్కొంటున్నారు, అన్ని విషయాలు వారి నోటిలో వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
రైతులకు భరోసా లేకుండా, కౌలు రైతులు, కూలీలకు అండగా నిలబడే పథకాలు లేనట్లు తెలిపారు. కాలేజీ చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు అందించకపోవడం పట్ల మండిపడ్డారు. 11 నెలల కాలంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం బోగస్‌గా మారిందన్నారు. రూ.10 లక్షల వైద్య సహాయం కోసం ఈ పది నెలల్లో ఎంతమందికి సేవలు అందించారో వెల్లడించాలి, లేకపోతే ప్రభుత్వం మాటలతో మాయ చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగా ఎలాంటి ఫించన్లు కూడా నమోదు చేయకపోవడం వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విధంగా, ప్రజల సంక్షేమం, అర్హతలు, హామీలు వంటి అంశాలపై స్పష్టమైన దృష్టిని సారించాలని డీకే అరుణ అన్నారు.
Yogi Adityanath : యూపీలో కలకలం.. సీఎం యోగికి ఆ మహిళ బెదిరింపు మెసేజ్