DK Aruna : అది యాదాద్రి కాదు యాదగిరిగుట్టనే

యాదగిరిగుట్ట లో జరుగుతున్న వేడుకలకు ప్రతిపక్ష పార్టీల నేతలను పిలవకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తప్పు పట్టారు.

యాదగిరిగుట్ట లో జరుగుతున్న వేడుకలకు ప్రతిపక్ష పార్టీల నేతలను పిలవకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తప్పు పట్టారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ను సైతం వేడుకలకు ఆహ్వానించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు.యాదగిరిగుట్ట పునః ప్రారంభోత్సవ వేడుకలకు సొంత పార్టీ నేతలను మాత్రమే ఆహ్వానించి ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకపోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని, గవర్నర్ ను సైతం ఆహ్వానించకపోవడం మహిళలను అవమానించడమేనని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత పొలంలో ఆలయాలు నిర్మించి ప్రారంభిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కెసిర్ కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత ఎంత మాత్రం లేదని డీకే అరుణ పేర్కొన్నారు. పురాతన యాదగిరిగుట్ట పేరును యాదాద్రి గా మార్చడం సరికాదని, యాదగిరిగుట్ట గానే పేరును కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు.