Site icon HashtagU Telugu

DJ Tillu: డీజే టిల్లు ‘ఓటీటీ’ రిలీజ్ కు రెడీ!

Dj Tillu

Dj Tillu

ఫిబ్రవ‌రి 12న విడుద‌లైన ‘డీజే టిల్లు’ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధమైంది. ‘డీజే టిల్లు’ నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే మేకర్స్ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో ‘త్వరలో వస్తుంది’ అని మాత్రమే స్పష్టం చేశారు. ఇంకా కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శింపబడుతుండగా, మార్చిలో ఎప్పుడైనా ఓటీటీలో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం మార్చి 10న ఆహా వీడియోలో రానున్నట్టు సమాచారం. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన ‘డిజె టిల్లు’ అన్ని సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మంచి వసూళ్లు కూడా సాధించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది.