Telangana: ఓటర్‌ స్లిప్‌ల పంపిణీ షురూ

అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్‌ స్లిప్‌లను ఎన్నికల అధికారులు పంపిణీ చేశారు.

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 12:50 PM IST

నవంబర్ 30, 2023న పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌ 3లో కౌంటింగ్ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్‌ కేంద్రం, బూత్‌ల వివరాలతో కూడిన ఓటర్‌ స్లిప్‌లను ఎన్నికల అధికారులు పంపిణీ చేశారు. ఓటర్‌ స్లిప్‌లతో పాటు ఓటరు గైడ్‌ బుక్‌లెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ, వినియోగంలో అర్హత గల పత్రాలు, పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాలు, అభ్యర్థుల వివరాల సమాచారాన్ని అందిస్తున్నారు. ఇతర వివరాలను VOTERS.CCI.GOV.IN వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.

తెలంగాణలో మొత్తం 3,26,18,205 ఓటర్లు, ఇందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది స్త్రీలు, 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,406 మంది, విదేశాలలో ఉంటున్న 2,944 మంది కూడా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,99,667 మంది యువ ఓటర్లు (18-19 ఏళ్ల వయస్సు) ఉన్నారు. వీరిలో 90 శాతం మంది తొలిసారిగా ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు.