Plastic Surgery: వికటించిన ప్లాస్టిక్ సర్జరీ.. ప్రముఖ మోడల్ మృతి

చాలామంది సెలబ్రెటీలు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ప్లాస్టిక్ సర్జరీల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. కానీ సెలబ్రెటీలు వీటి గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ సర్జరీల వైపు మోగ్గు చూపుతారు.

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 10:28 PM IST

Plastic Surgery: చాలామంది సెలబ్రెటీలు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ప్లాస్టిక్ సర్జరీల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. కానీ సెలబ్రెటీలు వీటి గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ సర్జరీల వైపు మోగ్గు చూపుతారు. ఒక్కొక్కసారి ప్లాస్టిక్ సర్జరీలు వికటించే మొదటికే మోసం వస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ వికటించడం వల్ల మొఖం వికారంగా తయారైపోతుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే అనేకం చోటుచేసుకున్నాయి.

అయితే ప్లాస్టిక్ సర్జరీలు వికటించడం వల్ల ఓ నటి మృతి చెందింది. ఇటీవల పాప్ సింగర్ జిమిన్ లా కనిపించేందుకు 12 సార్లు సర్జరీ చేయించుకుంది. తాజాగా అమెరికన్ స్టార ్కిమ్ కర్ధాషియ్ లా కనిపించేందుకు ఓ మోడల్ సర్జరీ చేయించుకుని చనిపోయింది. క్రిస్టినా అస్తెన్ గౌర్కాన అనే మోడల్ కిమ్ కర్ధాషియన్ లా మారాలనుకుంది. దీని కోసం పలుమార్లు సర్జరీలు చేయించుకుంది. తాజాగా మరోసారి కూడా సర్జరీ చేయించుకుంది. కానీ చివరికి అది వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది.

సర్జరీ కారణంగా గుండె పనితీరుకు అవాంతరం ఏర్పడింది. దీని వల్ల ఆమెకు గుండెపోటు రావడంతో మరణించింది. చనిపోయి కొద్దిరోజులు కాగా.. క్రిస్టినా కుటుంబసభ్యులు ఈ విషయాన్ని ఆలస్యంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. తను చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ ఆమె ప్రాణాన్ని తీసిందని, గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబభస్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. అస్తెన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందని, ఈ విషాద వార్తను మమ్మల్ని కలిచివేస్తుందని తెలిపారు. ఆమె తీసుకున్న చికిత్స వల్ల ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో చెప్పారు.

అయితే ప్లాస్టిక్ సర్జరీల వల్ల నటీనటులు ప్రాణాలు కోల్పోవడం ఇది తొలిసారు కాదు. గతంలో ఇలాంటివి అనేకం చోటుచేసుకున్నాయి. దీంతో ప్లాస్టిక్ సర్జరీల మోజులో తమ ప్రాణాలు కోల్పోతున్నారు.