Site icon HashtagU Telugu

Telangana Farmers:కేసీఆర్ అంటున్న ప్రత్యామ్నాయ పంటలపై ప్రజల అభిప్రాయం ఏంటంటే

రైతులు వరిపంట వేయోద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేసింది తప్పా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహనా కల్పించలేదని కనీసం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వరి స్థానంలో వేరే పంటలు వేస్తే లాభం ఉంటుందని ప్రభుత్వం చెప్తోందని కానీ వరిపంట కి ప్రత్యామ్నయం లేదని రైతులు చెబుతున్నారు.

వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలపై ఒక పాలసీని తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రభుత్వాలకు రైతులపై చిత్తశుద్ధి లేదని రైతులు తమ గోసను వెళ్లబోసుకుంటున్నారు.

టీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న ఆదిపత్య డ్రామాలో రైతులు నష్టపోతున్నారని, ఇప్పటికీ రైతుల్లో వరిధాన్యంపై ఎంత అస్పష్టత ఉందో ప్రత్యామ్నాయ పంటలపై కూడా అంతే అస్పష్టత ఉందని ప్రభుత్వం చొరవ తీసుకోని ప్రత్యామ్యాయ పంటలపై ఒక క్లారిటీ ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.