Site icon HashtagU Telugu

Vizag : నేవీ రిహార్సల్స్ లో అపశ్రుతి

Vizag Navy Rehearsal

Vizag Navy Rehearsal

విశాఖపట్టణం ఆర్కే బీచ్‌(Visakhapatnam RK Beach)లో నిర్వహించిన నేవీ రిహార్సల్స్‌(Navy Rehearsals)లో అపశ్రుతి చోటు చేసుకుంది. రిహార్సల్స్ సమయంలో పారాచూట్లు ఒకదానితో మరొకటి ఢీకొట్టడంతో పారాచూట్లతో కమాండోలు కిందకు దూకారు. వీరిని వెంటనే జెమిని బోట్లు రక్షించాయి. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదని సమాచారం. భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సన్నాహక విన్యాసాలు తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో జరగనున్నాయి.

Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్‌ రేస్ కేసు.. ఆ ఇద్దరికి మరోసారి ఈడీ నోటీసులు

ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవాన్ని విశాఖలో జరపడం ఆనవాయితీగా మారింది. అయితే, ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రం ఒడిశాలో పూరీ తీరంలో నౌకాదళ దినోత్సవం నిర్వహించారు. దీంతో 2025 జనవరి 4న ఈ కార్యక్రమం విశాఖ తీరంలో తిరిగి జరగనుంది. నేవీ విన్యాసాల్లో గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. శత్రువులపై దాడులు, సైనికులను రక్షించే సన్నివేశాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తాయి. పారాగ్లైడర్లు ఆకాశంలో దూసుకెళ్లిన తీరు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ సన్నాహక విన్యాసాల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. ఇక జనవరి 4న జరిగే విన్యాసాల కార్యక్రమానికి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం.