CM Jagan: ప్రాజెక్టుల ఏర్పాటుతో 6, 705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి: సీఎం జగన్

 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 2వేల 851 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 6వేల 705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 04:52 PM IST

శ్రీ సత్యసాయి జిల్లా గూడు పల్లి వద్ద  125 కోట్ల రూపాయల తో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, మడక సిర వద్ద  250 కోట్ల రూపాయల తో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రారంభించారు. వీటితో పాటు కొన్ని ఆహార శుద్ధి, ఇథనాల్ తయారీ పరిశ్రమలు వర్చువల్ గా ప్రారంభించారు.  13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 2వేల 851 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 6వేల 705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్రోల్ ఉత్పత్తుల్లో వినియోగించే ఇథనాల్ తయారీ పరిశ్రమ అనంతపురం జిల్లా డి.హిరేహాల్ లో 544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా

తిరుపతి నాయుడు పేటలో 800 కోట్ల రూపాయల తో గ్రీన్‌లామ్ సౌత్ ప్రాజెక్ట్,  బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద  225 కోట్ల రూపాయల తో శ్రావణి బయో ఫ్యూయల్. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 200 కోట్ల రూపాయల తో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పు గోదావరి జిల్లా ఖండవల్లి వద్ద 150 కోట్ల రూపాయల తో రవళి స్పిన్నర్స్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

Also Read: Moringa: మునగాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా