Site icon HashtagU Telugu

Dinesh Karthik: ఆ ప్రశంసకు గాల్లో తేలినట్టుంది

Dinesh Karthik Kkr Imresizer

Dinesh Karthik Kkr Imresizer

ఐపీఎల్ 15వ సీజన్ లో కేవలం యువ ఆటగాళ్ళే కాదు కొందరు సీనియర్ ప్లేయర్స్ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రాబిన్ ఊతప్ప , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున దినేశ్ కార్తీక్ వంటి ఆటగాళ్ళు తమ బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నారు. వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ సాగుతుంది. బెంగళూరు జట్టుకు మంచి ఫినిషర్ గా సక్సెస్ అవుతున్న దినేశ్ కార్తీక్ చెన్నైతో మ్యాచ్ లోనూ రాణించాడు.

కేవలం 14 బంతుల్లోనే 34 రన్స్ చేసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించినా… మిగిలిన వారి నుంచి సపోర్ట్ లేకపోవడం ఫలితం లేకపోయింది. అయితే దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఫిదా అయ్యాడు. డీకేను మెచ్చుకుని అభినందించాడు. దీనిపై సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘ఈరోజుల్లో చాలా మంది బౌలర్ వేసే లైన్ అండ్ లెంగ్త్ చూసి ఆడేవారు లేరు.. దినేష్ కార్తీక్ ఆ విషయంలో చాలా బెటర్. చాలా త్వరగా బౌలింగ్ లెంగ్త్ కనిపెట్టి ఆడుతున్నాడు. 360 డిగ్రీస్‌లో అద్భుతంగా రాణిస్తూ పరుగులు రాబడుతున్నాడు’. అని సచిన్ ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేశాడు. దీంతో దినేశ్ కార్తీక్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. సచిన్ టెండూల్కర్ తనను మెచ్చుకోవడంపై స్పందించిన దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు.

‘గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ ది టైమ్ నన్ను మెచ్చుకోవడంతో మేఘాల్లో తేలినట్టు ఉంది’. అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. కాగా ఈ సీజన్ లో దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ కు ఫినిషర్ గా రాణిస్తాడని విశ్లేషిస్తున్నారు.