Comedian Devraj Patel : ‘దిల్ సే బురా లగ్తా హై’ ఫేమ్ యూట్యూబ్ కమెడియన్ దేవరాజ్ పటేల్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవరాజ్.. ఒక కామెడీ వీడియోను చిత్రీకరించేందుకు రాయ్‌పూర్ కు బైక్ పై మిత్రుడు రాకేష్ మన్హర్ తో కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై దేవరాజ్ వెనుక సీటులో కూర్చున్నాడు. తెలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లభందిహ్ ప్రాంతానికి బైక్ చేరుకోగానే.. వెనుక వైపు నుంచి ఒక ట్రక్కు వచ్చింది. వీరి పక్క నుంచి ట్రక్కు దూసుకొస్తూ.. మోటార్ సైకిల్ హ్యాండిల్ ను ఢీకొటింది. దీంతో హ్యాండిల్ షేక్ అయింది. ఫలితంగా బైక్ ను డ్రైవ్ చేస్తున్న రాకేష్ మన్హర్ దానిపై కంట్రోల్ కోల్పోయాడు.
“दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए.
इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है.
ईश्वर उनके परिवार और चाहने वालों को यह दुःख सहने की शक्ति दे. ओम् शांति: pic.twitter.com/6kRMQ94o4v
— Bhupesh Baghel (@bhupeshbaghel) June 26, 2023
Also read : Worlds Ugliest Dog : వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్ ఇదే.. ఫ్లాష్ బ్యాక్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
బైక్ ఒక్కసారిగా కుదుపుకు గురి కావడంతో వెనుక సీటులో కూర్చొని ఉన్న దేవరాజ్.. ట్రక్కు వెనుక చక్రం కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ బైక్ రైడర్ రాకేష్ మన్హర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. అతను వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేశాడు. దేవరాజ్ పటేల్‌ను(Comedian Devraj Patel) వెంటనే ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ లోని మహాసముంద్‌కు చెందిన దేవ్‌రాజ్ పటేల్ ‘దిల్ సే బురా లగ్తా హై’ అనే కామెడీ వీడియో ద్వారా ప్రజాదరణ పొందాడు. దేవ్‌రాజ్ పటేల్ మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ట్వీట్ చేస్తూ.. దేవరాజ్ పటేల్ పాత వీడియోను షేర్ చేశారు.