Dil Raju React On Karthikeya 2: రాసే ముందు క్లారిటీ ఇవ్వండి!

యూబ్యూబ్, వెబ్ సైట్స్ లో  వ్యూస్ పొందాలనే ఉద్దేశ్యంతో తనపై గాసిప్‌లను ప్రచారం చేస్తన్నారని నిర్మాత దిల్ రాజు

Published By: HashtagU Telugu Desk
Dil Raju

Dil Raju

యూబ్యూబ్, వెబ్ సైట్స్ లో  వ్యూస్ పొందాలనే ఉద్దేశ్యంతో తనపై గాసిప్‌లను ప్రచారం చేస్తన్నారని నిర్మాత దిల్ రాజు మీడియాపై విరుచుకుపడ్డాడు. నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన కార్తికేయ 2 సక్సెస్ మీట్ సందర్భంగా “రాసే ముందు క్లారిటీ ఇవ్వండి లేదా గాసిప్ వార్తలు రాయవద్దు” అని హెచ్చరించాడు. నాగ చైతన్య థ్యాంక్యూ కారణంగా తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని కార్తికేయ 2 నిర్మాతలను కోరినట్లు దిల్ రాజు వెల్లడించారు.

“కార్తికేయ 2 విడుదల తేదీని నిర్ణయించడంపై మేం చాలాసార్లు మాట్లాడుకున్నాం. చివరకు ఆగస్టు 13 న విడుదలైంది. నైజాం ఏరియాలో 4 కోట్ల రూపాయలను వసూలు చేసింది” అని ఆయన పేర్కొన్నారు. హీరో నిఖిల్‌తో తనకు మంచి అనుబంధం ఉందని దిల్ రాజు స్పష్టం చేశారు. నాకు, నిఖిల్‌కు మంచి సంబంధాలు లేవని వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానెల్‌లలోని ఒక విభాగం రాశాయి” అని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. . అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం చందూ మొండేటి దర్శకత్వం వహించిన కార్తీకేయ 2 తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

  Last Updated: 16 Aug 2022, 06:16 PM IST