CM Revanth Reddy : నెల రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్‌ కార్డులు : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల హెల్త్‌ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్‌ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్‌ కార్డుల్లో గత చికిత్స వివరాలు అన్నీ ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Digital health cards for people within a month: CM Revanth Reddy

Digital health cards for people within a month: CM Revanth Reddy

Digital Health Profile Cards : సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రజలకు మరో 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌ రెనోవా క్యాన్సర్‌ ఆస్పత్రిని సీఎం రేవంత్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందాలనేదే తమ లక్ష్యమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఖర్చును రూ.10లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే.. రాబోయే 30 రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ విడి విడిగా హెల్త్‌ ప్రొఫైల్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read Also: CBI: రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ.. సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల హెల్త్‌ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్‌ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్‌ కార్డుల్లో గత చికిత్స వివరాలు అన్నీ ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  దుర్గాబాయి దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సామాన్య ప్రజలు కూడా మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జవహర్ లాల్ నెహ్రు ముందు చూపు వల్లనే దేశంలో వైద్య రంగం గణనీయంగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన చాలా తక్కువ అని.. క్యాన్సర్ వ్యాధికి వైద్య సదుపాయాలు మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు కూడా క్యాన్సర్ చికిత్స లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Read Also: Ashish Nehra: జాక్ పాట్ కొట్టిన ఆశిష్ నెహ్రా.. గుజ‌రాత్ ప్ర‌ధాన్ కోచ్‌గా భారీ వేత‌నం..!

 

  Last Updated: 26 Sep 2024, 06:58 PM IST