2019 ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి (Jagan) ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలపై, డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఎన్నో మాటలు చెప్పారు. అయితే సీఎం అయ్యాక మాత్రం వాటిని పూర్తిగా మరిచిపోయారు. డీఎస్సీ ప్రకటనలను వాయిదా వేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారు. ఒక్కసారి కూడా స్పష్టమైన ప్రణాళిక లేకుండా, అయోమయంగా నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా అభ్యర్థులు నిరాశకు లోనవుతూ వచ్చారు.
జగన్ రెడ్డి పాలనలో డీఎస్సీ అభ్యర్థులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. జంబో డీఎస్సీ, మెగా డీఎస్సీ పేర్లతో సరైన స్పష్టత లేకుండా నోటిఫికేషన్లు ఇచ్చి, చివరకు నిమిషాల వ్యవధిలో పరీక్షలు పెట్టారు. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం, అప్రెంటీస్ విధానంతో రెండు సంవత్సరాలు గడిపించడంవల్ల అభ్యర్థుల భవిష్యత్తు దెబ్బతిన్నది. కొంతమంది టీచర్లను మద్యం దుకాణాల వద్ద డ్యూటీకి పెట్టడం వంటి నిర్ణయాలు ప్రభుత్వం వృత్తిపరమైన గౌరవాన్ని తగ్గించేశాయి.
AP SSC Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్, రిజల్ట్స్ చూసుకోండిలా?
అభివృద్ధికి దూరమైన ఆంధ్రప్రదేశ్
జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా దూరమైంది. కొత్తగా ఎలాంటి పారిశ్రామిక వృద్ధి జరగలేదు. అప్పటి వరకు ఉన్న సంస్థలు కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఉద్యోగావకాశాలు తగ్గిపోవడంతో యువత మిగిలిన రాష్ట్రాల వైపు వెళ్లారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలపై పన్నుల భారం పెరిగింది. ఇళ్లు నిర్మించుకునేవారికి, విద్యుత్తు వినియోగదారులకు, ఎస్ఎంఇ యజమానులకు అన్ని రంగాల్లో భారం పెరిగింది.
చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాల జల్లు
టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఎస్సీ ద్వారా వేలాది ఉద్యోగాలను భర్తీ చేశారు. 2014 నుండి 2019 వరకు 18 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. మొత్తం 11 సార్లు డీఎస్సీ నిర్వహించి దాదాపు 1,80,208 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు స్కూల్స్‌లో ఉన్న టీచర్లలో అధిక శాతం చంద్రబాబు హయాంలో నియమితులైనవారే. ఇది ఆయన పాలనలో ఉన్న నిబద్ధతను, కార్యచరణను స్పష్టంగా చూపిస్తుంది. ఇక ఇప్పుడు మరోసారి సీఎం అయినా చంద్రబాబు..వైసీపీ ప్రభుత్వంలో వెనుకపడిన రాష్టాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల్లో మళ్లీ ఆశలు పుట్టించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తూ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇది చూసి జగన్ కు చంద్రబాబు కు ఉన్న డిఫరెంట్ అని మాట్లాడుకుంటున్నారు.
CM Chandrababu: రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే!