Site icon HashtagU Telugu

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా పెనాల్టీ పడిందా.. అయితే ఇలా చేయండి?

Credit Card

Credit Card

రోజురోజుకీ క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించిన తర్వాత కార్డ్ బిల్లు సమయానికి చెల్లించినప్పటికీ కొన్ని కొన్ని సార్లు పెనాల్టీ వేస్తూ ఉంటారు. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చే బిల్లు వడ్డీ పెనాల్టీ చార్జీలతో కలిపి వసూలు చేస్తూ ఉంటారు. మరి అటువంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇటువంటి పరిస్థితులలో కస్టమర్ నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేయవచ్చు. కస్టమర్ బ్యాంకు కు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు చేయాలి అంటే ఆర్బిఐ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫిర్యాదులు చేయాల్సి ఉంటుంది. అనగా cms.rbi.org.in లో బ్యాంక్‌కి సంబంధించిన కంప్లైంట్‌ చేయవచ్చు.

అయితే ఫిర్యాదు చేయడానికంటే ముందుగా బ్యాంకు ను సంప్రదించాలి. అలాగే మీరు కంప్లైంట్ చేసిన రికార్డును మీ వద్ద ఉంచుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే దానిని ప్రూఫ్ గా మీరు చూపించవచ్చు. బ్యాంకుకు ఫిర్యాదు చేసిన ఇటువంటి స్పందన రాకపోతే వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదంటే లోక్ పాల్ లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే బ్యాంకుకు ఫిర్యాదు చేసిన తర్వాత నుంచి 30 రోజుల తర్వాత మాత్రమే ఆర్బిఐ కి ఫిర్యాదు చేయాలి. మరి ఆన్లైన్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ముందుగా cms.rbi.org.inకి వెళ్ళి ఫైల్ ఏ కంప్లైంట్‌ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్‌ పై కనిపించే క్యాప్చా ఎంటర్ చేయాలి.

అప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్‌ అయినా తర్వాత మీరు మీ పేరు, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత అక్కడ కనిపించే OTP కోసం క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు బ్యాంక్ పేరు, ఫిర్యాదు గల కారణాల వివరాలను నమోదు చేయాలి.. అలాగే మీరు బ్యాంక్ నుంచి నష్టపరిహారాన్ని కూడా డిమాండ్ చేయవచ్చు. చివరగా మీరు మీ కంప్లైంట్‌ను సబ్మిట్‌ చేయాలి. మీరు ఈ ప్రాసెస్‌ పూర్తి చేసిన తర్వాత మీకు కంప్లైంట్‌ నంబర్ వస్తుంది. ఈ నంబర్‌ మీ ఫిర్యాదును ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. దానిని సేవ్‌ చేసుకకోవాలి.