ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ట్విట్టర్ ను 44 బిలియన్ల డాలర్లకు సొంతం చేసుకున్నారు ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్. ఒక్కో షేరుకు 54.20డాలర్లకు కొనుగోలు చేసిన ఈ బిలియనీర్…తాజాగా తన తదుపరి టార్గెట్ ను కూడా ప్రకటించాడు. త్వరలో కోకాకోలాను కొనుగోలు చేస్తానని వెల్లడించారు. కోకాకోలాని కొనుగులు చేసి ఇల్లీగల్ గా డ్రగ్ గా పేరున్న కొకైను కోకాకోలాకు తిరిగి చేరుస్తానని మస్క్ వ్యాఖ్యానించారు. కోకా కోలా డ్రింక్ లో కోకా ఆకులు, కోలా గింజలు ఉండేవని…కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్ డ్రగ్ కొకైన్ వస్తుందని తెలిపారు. అప్పట్లో కోకా కోలా కూల్ డ్రింక్ అధికంగా కోకా ఆకుల మీదే ఆధారపడుతుండేది. ఆ రోజుల్లో కోకైన్ ను ఔషధంగా పరిగణించినప్పటికీ…చివరకు నిషేధిత జాబితాలో దాన్ని చేర్చారు. అమెరికా కూడా దానిని నిషేధించడంతో కోకా కోలా నుంచి కోకా ఆకులు దూరమై అందుకు బదులుగా డీకోకైనైజ్డ్ కోకా ఆకులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మస్క్ కోకాకోలాకు తిరిగి కొకైన్ ను తీసుకొస్తానంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022
ఎలన్ మస్క్ కు ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేయడం ఇదేమీ కొత్త కాదు. ట్విట్టర్ ను హస్తగతం చేయడానికి ముందు ఇలాంటి ట్వీట్లతోనే సంచలనం క్రియేట్ చేశారు. అంతకుముందు టెస్లా వాటా షేర్లు అమ్మడంపై ట్విట్టర్ వినియోగదారులకు పోల్ నిర్వహించాడు. ఇప్పుడు ఈ కోవలోనే కోకా కోలపై ఫన్నీగా ట్వీట్ చేసాడు. అయినప్పటికీ మస్క్ ఏం చేస్తాడోనన్న తీవ్ర చర్చ జరుగుతోంది.