Alia Bhatt: అలియా అప్సెట్…రాజమౌళిని అన్ ఫాలో చేసిన బ్యూటీ…!!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రాజమౌళి డైరెక్షన్ అనగానే ఇంకో ఆలోచన లేకుండా ఈ మూవీకి అలియా ఒకే చెప్పింది.

Published By: HashtagU Telugu Desk
Alia Rajamouli

Alia Rajamouli

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రాజమౌళి డైరెక్షన్ అనగానే ఇంకో ఆలోచన లేకుండా ఈ మూవీకి అలియా ఒకే చెప్పింది. అయితే చివరకు అలియాకు నిరాశే మిగిలింది. ఈ మూవీలో ఆమె పాత్ర చాతా తక్కువ సమయం కనిపిస్తుంది. ఎన్నో ఆశలతో ఈ ప్రాజెక్టును అంగీకరించిన అలియాకుక…స్క్రీన్ పై పెద్దగా స్పేస్ లేకపోవడంతో గట్టి షాక్ తగిలింది. దీంతో ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి రాజమౌళిని అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి పలు పోస్టులను కూడా అలియా డిలీట్ చేసేసింది.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడకముందు నిర్వహించిన మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో అలియా హుషారుగా పాల్గొంది. అయితే రిలీజ్ తేదీ ఖరారైన తర్వాత జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్ కనిపించలేదు. అంతేకాదు సినిమా హిట్ అయినప్పటికీ…అలియా సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కూడా షేర్ చేయలేదు. బాలీవుడ్ లో స్టార్ డమ్ ఉండే అలియాకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇస్తే బాగుండేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. అలియా అప్సెట్ అవడంలో ఏమాత్రం తప్పులేదంటున్నారు.

  Last Updated: 29 Mar 2022, 11:42 AM IST