Dhoni Master Plan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం తేదీ సమీపిస్తోంది. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈసారి మెగా వేలం రసవత్తరంగా ఉండబోతుంది.జోస్ బట్లర్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ మరియు శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్‌లు ఏ జట్టుకు ఆడతారో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా వేలంలో అందరి చూపు చెన్నై సూపర్ కింగ్స్ పైనే (Dhoni Master Plan) ఉండబోతోంది. ఎందుకంటే చెన్నై సీనియర్ ఆటగాళ్లనే చూస్ చేసుకుంటుంది. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ ఆర్థికంగానూ తోడ్పడుతుంది.
త్వరలో జరగబోయే మెగా వేలంలో కూడా చెన్నై తమ జట్టులోకి సినియర్లనే జోడించవచ్చు. మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసింది. దీంతో డుప్లెసిస్ వేలంలోకి ప్రవేశించాడు. వేలంలో సిఎస్కె అతన్ని కొనుగోలు చేయాలనీ అనుకుంటుంది. ఫాఫ్ డు ప్లెసిస్ గతంలో చెన్నైకి ఆడాడు. చెన్నై తరుపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇనింగ్స్ ఆడాడు. ఫాఫ్ ఓపెనర్‌తో పాటు అద్భుతమైన ఫీల్డర్ కూడా. మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈ 40 ఏళ్ల సీనియర్ ప్లేయర్ని చేర్చుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదు.
Also Read: Asian Champions Trophy: చైనాకు షాక్.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీగా భారత్ జట్టు!
కేకేఆర్ మిచెల్ స్టార్క్‌ను రీటైన్ చేయలేదు. గత సీజన్ కి ముందు కేకేఆర్ స్టార్క్ ను 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ లోనే అతి పెద్ద బిడ్డింగ్. అయితే గత సీజన్ ఆరంభంలో స్టార్క్ అనుకున్న స్థాయిలో రాణించనప్పటికీ ప్లేఆఫ్స్‌లో తన బలమైన ప్రదర్శనతో కెకెఆర్ని ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కృషి చేశాడు. అయినప్పటికీ కేకేఆర్ అతన్ని నిలబెట్టుకోలేదు. దీంతో చెన్నై స్టార్క్‌ను లక్ష్యంగా చేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో స్టార్క్ ప్రతిభ ఏంటో చెన్నైకి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో మెగవేలంలో స్టార్క్ కోసం పోటీ పడేందుకు సిద్దమవుతుంది.
ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తొలిసారి ఐపీఎల్ గడప తొక్కనున్నాడు. మెగా వేలం కోసం అండర్సన్ తన పేరును నమోదు చేసుకున్నాడు. సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ ఆండర్సన్ కోసం అనేక జట్లు గట్టిగానే పోటీ పడబోతున్నాయి. 43 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్‌పై అత్యధిక వేలం వేసేందుకు చెన్నై సిద్దమవుతుంది. అండర్సన్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో. మరియు అతని అనుభవం దృష్ట్యా చెన్నై అతన్ని తమ జట్టులోకి తీసుకునేందుకు భారీగానే ఖర్చు చేయనుంది.