Site icon HashtagU Telugu

MS Dhoni: ధోని మరో ఐదేళ్లు ఆడుతాడు : ఫ్యాన్స్ ఖుషీ

MS Dhoni

New Web Story Copy 2023 05 20t184726.103

MS Dhoni: ఐపీఎల్ 2023 సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఫాలోయింగ్ చూస్తే అవాక్కవల్సిందే. మ్యాచ్ ఏదైనా సరే ధోని ఉంటే ఆ కిక్కే వేరు అన్నట్టుంది ఈ ఏడాది ఐపీఎల్ సీజన్. ఒకప్పుడు చెన్నై హోమ్ గ్రౌండ్ సిఎస్కె ఫాన్స్ తో నిండిపొయ్యేది. కానీ ఈ ఏడాది గ్రౌండ్ ఏదైనా సరే మాహీ ఉన్నాడంటే ఆ స్టేడియం పసుపు కలర్ తో నిండిపోతుంది. ఇక ఈ ఏడాది ధోని చివరి ఐపీఎల్ అన్న సంకేతాలు వినిపించడంతో చివరిసారిగా మాహీ ఆటను చూసేందుకు ఫాన్స్ ఎగబడుతున్నారు.

ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీతో తలపడుతుంది. కాగా ఇప్పటికే ఢిల్లీ ప్లే ఆఫ్ నుండి నిష్క్రమించింది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కాకుండా ఐపీఎల్ 16వ సీజన్ ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ అని అభిమానులు అంచనా వేస్తున్నారు. దీంతో ధోనీ సారథ్యంలోని సీఎస్‌కేకు మద్దతుగా అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో మాజీ టీమిండియా ఆటగాడు యూసఫ్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

ధోనికి ఇది చివరి ఐపీఎల్ కాదని, అతను మరో 5 ఏళ్ళు ఆడతాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఇతర ఆటగాడి కెప్టెన్సీలో ఆడతాడని తెలిపాడు. యూసఫ్ పఠాన్ చేసిన ఈ కామెంట్స్ తో చెన్నై అభిమానులు, ధోని ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మాహీ భాయ్ ఖేల్ అంటూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు.

పాయింట్ల పట్టికలో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ రెండవ స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ టాప్-2లో చోటు దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించాలని చూస్తోంది. అలా రాణిస్తే క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌తో ఢీకొంటుంది.

Read More: Bichagadu 2: మంచి ఓపెన్సింగ్ తో దూసుకుపోతున్న ‘బిచ్చగాడు2’