Site icon HashtagU Telugu

Dhanush Divorce: 18 ఏళ్ల బంధానికి గుడ్ బై.. భార్యతో విడిపోతున్నట్లు ధనుష్‌ ట్వీట్!

dhanush

dhanush

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ హీరో ధనుష్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నటుడు ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వీరిద్దరికి 2004 లో వివాహం జరిగింది. వీళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు. పద్దెనిమిది సంవత్సరాల స్నేహితులుగా, దంపతులుగా, తల్లితండ్రులుగా, శ్రేయోభిలాషులాగా కలిసున్నామని, తమ ప్రయాణంలో ఒకరిని ఒకరం అర్ధం చేసుకుంటూ, సర్ధుకుపోతూ, పరిస్థితులకు అనుగుణంగా ఇద్దరం కలిసి నడిచామని, ఇక ఇప్పుడు ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని ధనుష్ తెలిపారు.

జంటగా విడిపోయి ఒకరి గురించి మరొకరు మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నామని, తమ నిర్ణయాన్ని గౌరవించి, తమకు ప్రైవసీ ఇవ్వాలని ధనుష్ కోరారు. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. సుచిలీక్స్ ఇన్సిడెంట్ లో ధనుష్ గురించి కూడా వార్తలొచ్చాయి. అప్పటినుండి ఈ ఇద్దరి మధ్యదూరం మొదలయిందని పరిశీలకులు తెలిపారు.

Exit mobile version