వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషించిన ధనుంజయ్ రెడ్డి (Dhanunjay Reddy) ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఆయన తీరుపై అప్పటినుంచే అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన జైలు కు వెళ్లడం తో ఆ అసంతృప్తి ఇప్పుడు బట్టబయలు అవుతుంది. వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తుండడం గమనార్హం.
Liquor Prices: తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఫుల్ బాటిల్‌పై భారీగా పెంపు!
ధనుంజయ్ రెడ్డి అధికారం మోజులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా నాయకులను పట్టించుకోకుండా, అధికారాన్ని అహంకారంగా ప్రదర్శించిన ధోరణి వల్ల అతనిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం, ప్రతీ సమస్యను కాలయాపన చేస్తూ అధికారం చూపించడం పలువురికి మింగుడు పడలేదు. ఫలితంగా ఇప్పుడు ఆయన జైలులోకి వెళ్లడంతో వారంతా తగిన శాస్త్రి జరిగిందని అంటున్నారు.
ప్రస్తుతం వైసీపీ నేతల్లో చాలా మంది ధనుంజయ్ రెడ్డిపై ఆగ్రహం తో మాట్లాడుతున్నారు. “ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో!” అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అతని చేతిలో జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటూ, జైల్లోనే కొంతకాలం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.