గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించినందుకు పోలీసుశాఖకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సంఘటన రహిత ఎన్నికలను నిర్వహించేందుకు వివిధ విభాగాల అదనపు డీజీలు, యూనిట్ అధికారులు, వారి బృందాలను ఆయన అభినందించారు.
“ఈ ఎన్నికల ప్రక్రియలో చాలా మలుపులు ఉన్నాయి. ఇది చాలా సుదీర్ఘమైన మారథాన్ ప్రక్రియ లాంటిది. అటువంటి సందర్భాల్లో మేం ఎంతగానో కష్టపడి చేశాం. ప్రత్యేకించి అన్ని యూనిట్‌లను ప్రశంసించడానికి పదాలు సరిపోవు’ అని అంజనీకుమార్ తెలిపారు.