తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం కక్షగట్టి, బలవంతంగా సెలవుపై పంపించిందంటూ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఆరోపణలు చేసారు. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. విషయం తెలియకుండా ప్రభుత్వం తనని బలవంతంగా సెలవులో పంపించిందంటూ తప్పుడు, భాద్యతా రహిత ప్రచారం చేయడంపట్ల మహేందర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఒక జాతీయపార్టీకి రాష్ట్ర అద్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదని, తమ రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ అధికారులపై ఈ విధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఎంపీ రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. కొన్ని క్రితం తాను తన ఇంట్లో జారిపడ్డానని, దాంతో తన ఎడమ భుజానికి మూడు చోట్ల ప్యాక్చర్ అయిందని ఆయన తెలిపారు.
వైద్యులు తన భుజం కదలకుండా కట్టుకట్టి, రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారని మహేందర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. డాక్టర్లు సలహాతో ఫిబ్రవరి 18 నుండి మార్చి 4వ తేదీ వరకు సెలవు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడతున్నట్లు ఆయన తెలిపారు. రేవంత్ చేసిన తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్థైర్యాన్ని దెబ్బతీయడంతోపాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందని డీజీపీ ఆందోళన వ్యక్తంచేశారు. భాధ్యతాయుతమైన సీనియర్ పబ్లిక్ సర్సీస్ అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణ, సంయయనం పాటించాలని మహేందర్ రెడ్డి సూచించారు.