వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. దర్శనం పూర్తి కావడానికి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం నాడు 82,265 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోగా, 41,300 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు హుండీ (విరాళం పెట్టె)కి 3.82 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది.
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Tirumala devotee