Site icon HashtagU Telugu

Srisailam: శ్రీశైలం మ‌ల్ల‌న్న ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు

Srisailam Imresizer

Srisailam Imresizer

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్ర‌ముఖ ఆల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతుంది. గోదావరి, కృష్ణా నదుల్లో భ‌క్తులు పుణ్యస్నానాలు ఆచరించి పూజ‌లు నిర్వ‌హించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పుణ్య‌క్షేత్రాల్లో భ‌క్తులు క్యూ క‌ట్టారు. ఇటు శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్యా గర్భగుడి దర్శనాలను అధికారులు రద్దు చేశారు. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, కుమారారం, క్షీరారం, భీమారం, అమరారం ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. త్రిపురాంతకం, బైరవకోన, శ్రీకాళహస్తి, కపిలతీర్థం తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.