Site icon HashtagU Telugu

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. క్యూలైన్స్ కిటకిట

Tirumala

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 3 రోజుల వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనానికి టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దీంతో క్యూలైన్‌ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది. రికార్డుస్థాయిలో భక్తులు రావడంతో శ్రీవారి దర్శనం చాలా నెమ్మదిగా సాగుతోంది. చాలామంది భక్తులకు విశ్రాంతి గదులు దొరక్కపోవడంతో రేకుల షెడ్డుల కింద, తిరుమల వీధుల్లోనే ఆశ్రయం పొందారు.