Site icon HashtagU Telugu

Srikalahasti: కొత్త దేవాదాయ మంత్రికి చేదు అనుభవం

Srikalahasti

Srikalahasti

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కొత్త దేవాదాయశాఖ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి బయట వస్తున్న సమయంలో మంత్రిని చూడగానే భక్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంత్రి దర్శనానికి రావడంతో…అధికారులు గంటలపాటు స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు.

దీంతో క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు మంత్రికి వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారుల…భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మంత్రి డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. భక్తుల ఆగ్రహాన్ని గమనించిన మంత్రి స్వయంగా భక్తుల వద్దకు వెళ్లి సర్ధిచెప్పారు. మంత్రి జోక్యం చేసుకోవడంతో వెంటనే అధికారులు.. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.