Medaram: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఉదయం నుండి పోటెత్తిన భక్తులు శ్రీ సారలమ్మ దేవత గద్దెకు వచ్చిన సందర్భంగా అమ్మ వారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం, దేవదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసి గద్దెల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి హెడ్ హెల్మెట్లు సమకూర్చారు. గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని వెంట వెంటనే తరలిస్తూ అమ్మవారి గద్దెలను శానీటేషన్ సిబ్బందిచే శుభ్రపరుస్తూన్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో గద్దెల ప్రాంగణంలో సింగరేణి రెస్కూ టీం, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, దేవాదాయశాఖ, శానిటేషన్ సిబ్బంది, మూడు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తూన్నారు.
మేడారం జాతర ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య వాచ్ టవర్ పై నుండి అమ్మ వారి గద్దేల వద్ద భక్తుల రద్దీని గమనిస్తూ వైర్లెస్ సెట్ల ద్వారా సంబంధిత సెక్టార్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.
కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ద్వారా జాతరలో నిరంతరం గమనిస్తూ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు,
తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరలో వృద్దులకు, దివ్యాంగులకు బ్యాటరీ కారు సేవలను రాష్ట్ర ప్రభుత్వం (దేవాదాయ శాఖ) అందుబాటులోకి తీసుకొని వచ్చింది. నడవలేని సీనియర్ సిటిజన్లను, దివ్యాంగులను సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం వరకు తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు బ్యాటరీ కార్లను వినియోగించనున్నారు.