ఇష్టదైవం సన్నిధిలో ఓ యువకుడు ప్రాణాలు విడిచిన (Youth Dies in Temple) ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి హోసింగ్ బోర్డు లో చోటుచేసుకుంది. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన విష్ణువర్ధన్(31) హైదరాబాద్లోని కూకట్ పల్లి హోసింగ్ బోర్డు లో నివాసం ఉంటూ ఓ ప్రవైట్ జాబ్ చేస్తున్నాడు. ఇతడికి దైవ భక్తి ఎక్కువ. ప్రతి రోజు స్థానికంగా ఉన్నఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేయడం అలవాటు. ఈరోజు కూడా అలాగే గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆలయంలోని ఓ స్తంభానికి ఆనుకొని అక్కడే కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న భక్తులు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. ఈ విషాద ఘటన తో ఆలయంలో విషాదం నెలకొంది.
ఇటీవల గుండెపోటు మరణాలు అనేవి ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్ల పైబడిన వారికే ఎక్కువగా గుండెపోటు అనేది సంభవించేది కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా గుండెపోటు అనేది వస్తుంది. చిన్న పిల్లాడి దగ్గరి నుండి 90 ఏళ్ల వయసు ఉన్న వారి వరకు అందరికి గుండెపోటు అనేది వస్తుంది. అప్పటి వరకు మన మధ్యనే సంతోషంగా ఉన్న వారు సడెన్ గా న్పోప్పితో కుప్పకూలి..కళ్లముందే మరణిస్తున్నారు.
గుండెపోటు రాకుండా నివారించడానికి..
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
వ్యాయామం చేయడం
పొగ తాగకపోవడం
రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటీస్ వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచడం
గుండెపోటు అనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్స్ చెపుతున్నారు.
Read Also : CM Revanth : ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్యాబినెట్ విస్తరణ జరుగుతుందా..?