Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం.. గుండెపోటుతో భక్తురాలి మృతి

వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో విషాదం జరిగింది. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది.

Published By: HashtagU Telugu Desk
Vemulawada

Resizeimagesize (1280 X 720)

Vemulawada: వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో విషాదం జరిగింది. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. కరీనంగర్ జిల్లా మనకొండూరు మండలం లింగపూర్ గ్రామనికి చెందిన లక్ష్మి ఉదయం క్యూ లైన్‌లో దర్శనానికి వెళ్తూ కుప్పకూలిపోయింది. ఘటనా స్థలంలోనే ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో లక్ష్మి అనే ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారు.

Also Read: Violence In Manipur: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ.. రెండు వర్గాల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుటుంబంతో కలిసి సోమవారం రాజన్న ఆలయానికి వచ్చింది. సోమవారం ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనం చేసుకోవటం కుదరలేదు. దీంతో మంగళవారం స్వామివారిని దర్శించుకోవచ్చు అని ఆలయ సమీపంలోనే నిద్రించింది. మంగళవారం ఉదయం దర్శనం కోసం రాగా క్యూ లైన్ లో నిలుచున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  Last Updated: 06 Jun 2023, 09:28 AM IST