శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. వరుస సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 50,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈరోజు (సోమవారం)కి ఈ సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్య విపరీతంగా ఉండడంతో ఆలయ సిబ్బంది రద్దీని అదుపు చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. పవిత్ర స్థలానికి వెళ్లే రహదారి వాహనాలతో నిండిపోయింది.దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా సాక్షి గణపతి దేవాలయం సమీపంలోని నల్లమల అటవీప్రాంతంలోని ఘాట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భక్తులకు వసతి, భోజనం, తాగునీరు సహా పలు సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ దర్శనం పూర్తి కావడానికి 7–8 గంటలు పట్టవచ్చని అధికారులు తెలిపారు.
Srisailam : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 8గంటల సమయం

Srisailam Imresizer