Site icon HashtagU Telugu

Devineni:ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి – మాజీ మంత్రి దేవినేని

devineni uma

devineni uma

ఏపీలో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని టీడీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.‘‘ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి’’ అనే నినాదంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం మైలవరం మండలం తోలు కోడు గ్రామంలో నిర్వహించిన గౌరవ సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైసీపీ డిఫెన్స్‌లో పడిందని అన్నారు. మైనింగ్ దోపిడీపై పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పీఆర్సీని పున స‌మీక్షించాలి, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి క‌నుస‌న్నల్లోనే మైనింగ్ దోపీడీ జరుగుతోందని అన్నారు. మైనింగ్, మ‌ద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియా ద్వారా వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. నాడు-నేడు కార్యక్రమాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. వినుకొండ‌లో మ‌ద్దతు ధ‌ర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టడం దారుణం. పంచాయతీలలో జగన్ రెడ్డి విపరీతమైన పన్నుల భారాన్ని మోపారు. ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న హామీ నెరవేర్చాలి. సమగ్ర తాగునీటి పథకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’’ అని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు