Santa Deverakonda: ఈ రౌడీ కరుణామయుడు.. 10 వేల చొప్పున 100 మందికి సాయం!

‘‘మనం ఎక్కడి నుంచో వచ్చామో.. అక్కడి ములాలు మరిచిపోవద్దు’’ ఈ మాటలు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు అతికినట్టుగా సరిపోతాయి.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2021 12 25 At 23.38.55 Imresizer

Whatsapp Image 2021 12 25 At 23.38.55 Imresizer

‘‘మనం ఎక్కడి నుంచో వచ్చామో.. అక్కడి ములాలు మరిచిపోవద్దు’’ ఈ మాటలు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు అతికినట్టుగా సరిపోతాయి. సినిమాల్లో రాకముందు అందరిలా సామాన్య మైన జీవితం గడిపాడు. ఎన్నో కష్టాలు పడి స్టార్ గా అవతరించాడు. అందుకే విజయ్ దేవరకొండ హీరోగా మారినా.. తన బేసిక్ లైఫ్ ను మరిచిపోవడం లేదు. తాను పడ్డ కష్టాలు తన అభిమానులు పడొద్దని మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.

క్రిస్మస్ సందర్భంగా పది మందికి వంద చొప్పున గిఫ్టులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ‘‘ శాంటా టైమ్ వచ్చింది. మీ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ ఇయర్ నేను కొంత మందికి మనీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ఓ మిలియన్ (రూ. 10 లక్షలు) ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో ఒకానొక సమయంలో నేను మిలియనీర్ అవ్వాలని అనుకున్నాను. ఈ రోజు మీ- అందరికీ మిలియన్ ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నందుకు హ్యాపీగా ఉన్నాను. మీలో వంద మందిని ఎంపిక చేసి… పదివేలు చొప్పున జనవరి 1న ఇస్తా. మీరూ ఈ మంచి కార్యక్రమంలో పార్ట్ కావాలి.

మీ కోసం మీరు అడగొద్దు. మీ ఫ్రెండ్ కోసం, ఫ్యామిలీ కోసం అడగండి. ఎవరికి, ఎందుకు డబ్బులు ఇవ్వాలనేది చెప్పండి. వంద మందిని ఎంపిక చేసి… జనవరి 1న వాళ్ల పేర్లు వెల్లడిస్తాం. ఒకవేళ మీరు రౌడీ క్లబ్‌లో సభ్యులు అయితే… మీ రౌడీ కోడ్ లేదా రౌడీ ఐడీ పేర్కొనండి’’ అంటూ రియాక్ట్ అయ్యాడు.

 

  Last Updated: 25 Dec 2021, 11:42 PM IST