Site icon HashtagU Telugu

AP TDP: జగన్  ని ఓడిస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్

Babu Rajendraprasad Jagan

Babu Rajendraprasad Jagan

AP TDP: ఈనెల పదమూడవ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా నూజివీడు నియోజకవర్గ టీడీపి,జానసేనా,బీజేపీ పార్టీ లా ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ ,ఎంఎల్ఏ అభ్యర్థులు పుట్టా మహేష్ యాదవ్ ,k.p.సారథితో పాటు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారు గోల్లవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి నీ ఓడగొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

నూజివీడు ఎంఎల్ఏ అభ్యర్థి కోలుసు పార్థసారథి గతంలో ఉయ్యూరు పెనమలూరు శాసనసభ్యుడిగా,మంత్రి గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, ప్రజల్ని,కార్యకర్తల్ని సొంత బిడ్డలవలె చూసుకుంటారని ,ఎంఎల్ఏ గా పార్థసారథికి,ఎంపీ గా పుట్టా మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, తేజా,బాబీ,వీరంకి మణి,సుందరయ్య,నూజివీడు నియోజకవర్గ టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.