BRS MLA: అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ అస్త్రాలు: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎన్నికల అస్త్రాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 06:02 PM IST

BRS MLA: అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎన్నికల అస్త్రాలని అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ‘నమస్తే నవనాథ పురం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో “ప్రజాశీర్వాద యాత్ర” నిర్వహించారు. ఆయన గ్రామమంతా కలియ తిరిగి బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆర్థిస్తూ ఇంటింటా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలతో కలిసి గ్రామంలోకి అడుగు పెట్టిన జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తమ అభిమాన నేతకు బ్రహ్మ రథం పట్టారు. పూలమాలలు, శాలువాలతో గ్రామస్తులు, పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు. “జై జీవనన్న, జైజై కేసీఆర్, జై తెలంగాణ”, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా” అన్న నినాదాలతో వెల్మల్ గ్రామం మారుమోగింది.

ఆయన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసు కున్నారు. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఈ పదేండ్లలో మీ గ్రామ అభివృద్ధికి ఏ చేశానో చెప్పడం బాధ్యతగా భావించి మీవద్దకు వచ్చానన్నారు. నేను వెల్మల్ వచ్చే సమయంలో మీ గ్రామానికి చెందిన రాములు, జస్వంత్, విజయలక్ష్మి, చిన్ను భాయి, భోజన్న, సౌందర్య, పెద్ద పోతన్న, వసంత కుమార్, గణేష్, మల్లేష్, సునీత, శాంత, భాగ్య తదితర వికలాంగులు నన్ను ఆపి ఎక్కడికి పోతున్నారు సార్ అని అడిగిన్రు. మీ ఊరికే పోయి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పి మూడోసారి కూడా నాకే ఓటేయమని అర్ధించడానికి వెళుతున్న అని చెప్పా. ఎందుకు సారు మీకనవసర శ్రమ. కేసీఆర్ మా వికలాంగుల పట్ల దేవుడు. మొన్ననే మా పెన్షన్లను రూ. 4016కు పెంచి మళ్లీ ఇప్పుడు రూ.6016 కు పెంచుతామని మాట ఇచ్చిన మహానేత కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మాపై ఉంది.

ఆర్మూరు నియోజకవర్గంలో 6వేలమంది వికలాంగులం ఉన్నాం. మేమే ఇంటింటికీ తిరిగి ఒక్కొక్కలం 15 ఓట్ల చొప్పున వేయించి మిమ్మల్ని70వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పిన్రు. అయినా నేను పోయి చేసిన ప్రగతి గురించి మా అక్కలు చెల్లెళ్లకు, మా అన్నలకు, తమ్ముళ్లకు చెప్పి వారి కడుపులో తలపెట్టు దీవించండి అని వేడుకోవడానికి మీ దగ్గరకొచ్చా అని జీవన్ రెడ్డి చెప్పారు. వెల్మల్ గ్రామ పంచాయతీలో 1534 ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. వృద్ధాప్య పింఛన్లు 298, వికలాంగుల పింఛన్లు 66, బీడీ కార్మికుల పింఛన్లు 727, వితంతు పింఛన్లు 371, ఒంటరి మహిళల పింఛన్లు 72 కలుపుకొని నెలకు రూ.2016, రూ. 4016 చొప్పున ఇప్పటివరకు ఈ గ్రామానికి రూ.34.82 కోట్లు పెన్షన్ల రూపంలో వచ్చాయి.

ఈ గ్రామానికి చెందిన 164 4 మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రూ14.67 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. వివిధ కారణాలవల్ల మృతి చెందిన 33 మంది రైతు కుటుంబాలకు రూ.1.65 కోట్ల రైతు బీమా పరిహారం అందింది. కల్యాణ లక్ష్మి ద్వారా రూ.2.10 కోట్లతో 226 మంది పేదింటి ఆడపిల్లలు, షాదీ ముబారక్ ద్వారా రూ.3.25లక్షలతో నలుగురు పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వమే పెళ్లిళ్లు జరిపించింది. రూ.626.57 లక్షలు ఖర్చు చేసి ఈ గ్రామంలోని 1564 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నాం. ఈ గ్రామంలోని 85 మహిళా గ్రూపులకు రూ.26.05 లక్షలు వడ్డీ లేని రుణాన్ని అందజేశాం. ఉపాధి హామీ పథకం ద్వారా ఒకటి పాయింట్ రూ.1.02 కోట్లతో 855 వ్యక్తిగత మరుగుదొడ్లు, రూ. 4.96 లక్షలతో 124 సోక్ పిట్ల నిర్మాణం పూర్తి చేశాం. ఈ గ్రామంలో రూ.2.65 లక్షలతో విద్యుత్ శాఖ ద్వారా మరమ్మత్తులు చేశాం. ఈ గ్రామానికి చెందిన 3850 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించు 450 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసాం. ఈ గ్రామానికి చెందిన 105 మంది తల్లులకు ప్రభుత్వ దవాఖానాలో ఉచిత ప్రసవాలు జరగగా వారికి కెసిఆర్ కిట్లు పంపిణీ చేశాం. ఆర్మూర్ నుంచి నందిపేట్ వయా వెల్మల్ రోడ్డు నిర్మాణానికి రూ.650 లక్షలు మంజూరు చేశామని జీవన్ రెడ్డి అన్నారు.