BCCI Secretary: బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో కొత్త కార్యదర్శిని (BCCI Secretary) ప్రకటించారు. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా నియమితులయ్యారు. ఆయన జై షా స్థానంలోకి రానున్నారు. జై షా ఐసీసీ చైర్మన్ అయిన తర్వాత ఈ పదవి ఖాళీ అయింది.
తాత్కాలిక కార్యదర్శిగా సైకియా
డిసెంబర్ 1న జై షా నిష్క్రమణ తర్వాత సైకియా బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగారు. BCCI రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఖాళీని 45 రోజులలోపు SGMని పిలవడం ద్వారా భర్తీ చేయాలి. అయితే ఈ రోజు బీసీసీఐ సర్వసభ్య సమావేశం జరగగా.. అందులో బీసీసీఐ కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.
Also Read: Pawan Kalyan: మెగా హీరోలకు కలిసిరాని పవన్ కల్యాణ్?
బీసీసీఐ కోశాధికారిగా ప్రభతేజ్ సింగ్ భాటియా నియమితులయ్యారు
ఆదివారం జరిగిన బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ (ఎస్‌జీఎం)లో సైకియాతో పాటు ప్రభతేజ్ సింగ్ భాటియా కూడా బీసీసీఐ కోశాధికారిగా అధికారికంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసిన ఆశిష్ షెలార్ స్థానంలో భాటియా బాధ్యతలు చేపట్టనున్నారు. బిసిసిఐ రిటర్నింగ్ ఆఫీసర్, భారత మాజీ సిఇసి అచల్ కుమార్ జ్యతి మంగళవారం జాబితాను ఖరారు చేసిన తర్వాత ఖాళీగా ఉన్న పోస్టులకు సైకియా, ప్రభతేజ్ మాత్రమే అభ్యర్థులు అని పేర్కొన్నారు.
Assam Cricket Association (ACA) takes immense pride in celebrating a historic moment for Assam as Mr. Devajit Saikia has been elected as the Secretary of the Board of Control for Cricket in India (BCCI).
1/4 pic.twitter.com/GqBz104GHH
— Assam Cricket Association (@assamcric) January 12, 2025
దేవ్‌జిత్ సైకియా ఎవరో తెలుసుకోండి
దేవ్‌జిత్ సైకియా క్రికెట్ కెరీర్ చాలా చిన్నది. అతను 1990- 1991 మధ్య కేవలం నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 53 పరుగులు, 9 వికెట్లు తీసుకున్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత లాయర్‌గా మారారు. గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.