Site icon HashtagU Telugu

RCB lost: భారీ స్కోరు చేసినా బెంగళూరుకు తప్పని ఓటమి

Pbks

Pbks

జట్టులో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు .. అయితేనే 206 పరుగుల టార్గెట్ ను మరో ఓవర్ మిగిలి ఉండగా చేదించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టులో బ్యాటర్లు అదరగొట్టారు. కెప్టెన్ డుప్లిసెస్‌కు విధ్వంసానికి తోడు దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్‌, విరాట్ కోహ్లీ సైతం రాణించ‌డంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించింది. 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 205 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరుకు ఓపెన‌ర్లు అనుజ్ రావత్, ఫాఫ్ డుప్లిసెస్ శుభారంభాన్ని అందించారు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు 50 ప‌రుగులు జోడించారు.తర్వాత డుప్లిసెస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో క‌లిసి రెండో వికెట్‌కు 61 బంతుల్లోనే 118 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓ ద‌శ‌లో సెంచ‌రీ చేసేలా కనిపించిన ఫాఫ్ 88 పరుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఔట‌య్యాడు. చివర్లో విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ ధాటిగా ఆడారు. దినేష్ కార్తీక్ 14 బంతుల్లోనే 32 ప‌రుగుల‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడితే… కోహ్లీ 29 బంతుల్లోనే 41 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, 2 సిక్సులు ఉన్నాయి. పంజాబ్ బౌల‌ర్లలో అర్ష్‌దీప్ సింగ్‌, రాహుల్ చాహ‌ర్ త‌లో వికెట్ తీశారు.

భారీ లక్ష్య చేదనలో పంజాబ్ ధాటిగా ఆడింది. ఓపెనర్లు తొలి వికెట్ కి 7.1 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్ 32 , ధావన్ 43 రన్స్ చేశారు. తర్వాత భనుక రాజపక్స కేవలం 22 బంతుల్లో 43 పరుగులు చేయగా…లివింగ్ స్టోన్ కూడా మెరుపులు మెరిపించాడు. చివర్లో వరుస వికెట్లు కోల్పోయినప్పటికీ షారూక్ ఖాన్, స్మిత్ పంజాబ్ విజయాన్ని పూర్తి చేశారు. విజ‌యానికి 18 బంతుల్లో 36 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో మ‌హ్మ‌ద్ సిరాజ్ వేసిన 18వ ఓవ‌ర్‌తో మ్యాచ్ మ‌లుపు తిరిగింది. ఆ ఓవ‌ర్ తొలి 3 బంతులను ఓడియ‌న్ స్మిత్ 6, 4, 6 బాదాడు. ఆ త‌ర్వాత ఓ సింగిల్ రాగా, చివ‌రి బంతిని ఓడియ‌న్ స్మిత్ మ‌ళ్లీ సిక్స్ బాదాడు. మొత్తంగా ఆ ఓవ‌ర్లో 25 ప‌రుగులు రావ‌డంతో మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత ఓవ‌ర్లో విజ‌యాన్ని అందుకుంది. దీంతో మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఓడియ‌న్ స్మిత్ 8 బంతుల్లోనే 25 రన్స్ , షారూక్ ఖాన్ 24 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

Photo Courtesy- PBKS Twitter