Site icon HashtagU Telugu

TSRTC Contest: ఐడియా చెప్పండి…రివార్డ్ పొందండి…ఆర్టీసీ ఎండీ బంపర్ ఆఫర్..!!

Sajanar

Sajanar

ఇన్నాళ్లూ పీకలోతు నష్టాల్లో నడిచిన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాలబాటపట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నాక కాస్త లాభాల బాటలో పయనిస్తోంది ఆర్టీసీ. వినూత్న పథకాలను రూపొందిస్తూ సంస్థ గట్టెక్కిండానికి సజ్జనార్ బాగానే కష్టపడుతున్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తీసుకోవల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నారు ఆయన.

తాజాగా సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు సజ్జనార్. ప్రయాణికుల కోసం 500ఎంఎల్ , వన్ లీటర్ వాటర్ బాటిళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ చేసే చారిత్రాత్మక మార్పుకు మీ తోడ్పాటు ఇవ్వండి. చరిత్రలో నిలిచిపోండి. అంటూ ట్వీట్ చేశారు. అసలు విషయం ఏంటంటే. వాటర్ బాటిల్ కు మంచి పేరు , డిజైన్ చెప్పండి రివార్డ్స్ పొందంటూ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ వాటర్ మీ దాహాన్నే తీర్చడమే కాదు…మీ గమ్యాన్ని చేరుతుందంటూ ఒకరు కామెంట్ చేయగా…టీఎస్ ఆర్టీసీ గమ్యాన్ని దగ్గర చేస్తుంది…మీ దాహాన్ని తీరుస్తుందంటూ మరొకరు కామెంట్ చేశారు. సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.