Godavari Express Train: పట్టాలు తప్పిన రైలు.. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ మరమ్మతులు!

ఘట్‌కేసర్‌ (Ghatkesar) పరిధిలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Train

Train

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు (Godavari Express Train) తప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘట్‌కేసర్‌ (Ghatkesar) పరిధిలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఘటనాస్థలానికి పెద్ద సంఖ్యలో రైల్వే సిబ్బంది, కార్మికులు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. పొక్లెయిన్‌, ఇతర యంత్రాల సాయంతో మరమ్మతు పనులను వేగవంతం చేశారు.

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ (Hyderabad) డెక్కన్ మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ గాయాలు కాలేవు. బీబీ నగర్ సమీపంలో రైలు వెనక భాగంలో దాదాపు ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. అయిల్ లీకవ్వడం, ఆటోమేటిక్ బ్రేక్ పడడమే ప్రమాదానికి కారణం. (Godavari Express Train) చివర్లో జనరల్ భోగీ దెబ్బ తిన్నట్లుగా వెల్లడించిన అధికారులు వెల్లడించారు. ఊహించని ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన రైలులోని ప్రయాణికులు ఆందోళన చెందారు. (Godavari Express Train) రైలు ఆపగానే గబాగబా కిందకు దూకేశారు ప్రయాణికులు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. రైలు పట్టాలు తప్పినా కిందపడకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం తప్పినట్టయింది.

Also Read: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 100 రాములోరి ఆలయాలు!

  Last Updated: 15 Feb 2023, 01:26 PM IST