Site icon HashtagU Telugu

Train Fire Incident: డీఎంయూ రైలులో భారీ అగ్నిప్రమాదం

Train Fire Incident

Train Fire(1)

 Train Fire Incident: ఆదివారం ఉదయం రత్లాం నుంచి ఇండోర్ వస్తున్న డీఎంయూ రైలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందిన సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం 6:35 గంటలకు ఇండోర్‌కు బయలుదేరిన DEMU రైలులోని ప్రీతమ్ నగర్ స్టేషన్ వద్ద రెండు కోచ్‌లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

రైలులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులకు ఏమి అర్ధం కానీ పరిస్థితి. సెకనులో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు తమ సామాన్లు బయటికి తీసుకుని వెళ్లి నిలబడ్డారు. మంటలను ఆర్పేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఘటన జరిగిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

DEMU రైలులో మంటలు చెలరేగిన గంట తర్వాత 7:50 గంటలకు అగ్నిమాపక దళం వచ్చింది. ప్రయాణికులందరినీ దించేశారు. రైలులోని రెండు బోగీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇప్పటి వరకు రైలులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.

Read More: Amritpal Singh Arrested: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన అమృత్ పాల్ సింగ్.. నెల రోజుల తర్వాత అరెస్ట్