SC Sub Classification: పాల్వంచ పట్టణ పరిధిలోని 5వ వార్డు గాంధీనగర్ లోని మాదిగ సంక్షేమ సంఘం కార్యాలయం నందు జరిగిన SC/ST ల వర్గీకరణ వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేశారు పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు.
షెడ్యూల్డ్ కులాల- షెడ్యూల్డ్ తెగల ఉపకులలో కేంద్ర/ రాష్ట్ర ఉద్యోగాలలో గాని , కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వల పథకాలలో గాని ఒకే కులానికి చెందిన వారే లబ్ధి చేకూర్చుకుంటున్నారని అన్నారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఆస్తులు పంచుకునే విషయంలో నలుగురికి సమనవాటా ఇస్తారు , అలానే ఎస్సీ/ ఎస్టీ ఉపకులలో కూడా అన్ని వర్గాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గాని , కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో గాని సమాన వాటా రావాలనే ఉద్దేశంతో ఎస్సీ ,ఎస్టీ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిందని చెప్పారు.
ఒక్క కులానికే న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో 61 ఎస్సీ ఉపకులాలు, 32 ఎస్టీ ఉపకులాలు ఉన్న అన్ని ఉపకులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎస్టీ-ఎస్సీల వర్గీకరణ అమలు చేసింది. అయితే నేటికీ 18 రోజులు గడుస్తున్నా కాలయాపన చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయకపోవడం సుప్రీం కోర్టు తీర్పును దిక్కరించినట్టేనని కటుకూరి శేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మేషపోగు జీవన్ కుమార్, తెళ్ళురి వెంకన్న ,ప్రశాంత్ కుమార్, సంగపంగా దుర్గ రావు, పిన్నింటి శేఖర్, ఇసనపల్లి వంశీ, చింత దుర్గారావు , సగుర్తి కోటేశ్వర రావు , కనకం ప్రసాద్ , కాకటి సీతారాములు , తదితరులు పాల్గొన్నారు.
Also Read: Epic Electric Scooter: ఈవీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!