Site icon HashtagU Telugu

Crime News: డెలివరీ బాయ్స్‌గా నటిస్తూ రూ.23.50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Crime News

Crime News

Crime News: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్‌ గా నటిస్తూ ఇద్దరు యువకులు నగదు, నగలు దోచుకెళ్లారు. కాన్పూర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో కూతురు ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ యువకులు దాదాపు రూ.23.50 లక్షల నగదు, నగలు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది.

కాన్పూర్ లోని చకేరిలోని అహిర్వాన్‌లోని ఆకాష్ గంగా విహార్ కాలనీ సమీపంలో నివసిస్తున్న కిరాణా వ్యాపారి నరేంద్ర గుప్తా తన భార్య రష్మీ మరియు చిన్న కుమార్తె నవ్యతో కలిసి షాపింగ్ కోసం మార్కెట్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఆయన పెద్ద కూతురు న్యాసా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌లుగా నటిస్తూ ఇద్దరు నిందితులు ఆర్డర్ డెలివరీ సాకుతో వారి ఇంటికి వెళ్లారు. అయితే ఆర్డర్ తీసుకోవడానికి న్యాసా ముందు నిరాకరించింది. కానీ యువకులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. న్యాసా మెడపై స్క్రూడ్రైవర్‌ పెట్టి చంపేస్తానని బెదిరించారు.దీంతో భయపడిన ఆమె లాకర్ తాళాలను నిందితులకు ఇవ్వగా, ఆ తర్వాత లాకర్ లో ఉంచిన రూ.3.50 లక్షల నగదు, రూ.20 లక్షల విలువైన నగలను దుండగులు ఎత్తుకెళ్లారు.

భార్యాభర్తలు అర్థరాత్రి ఇంటికి చేరుకోగా కుమార్తె జరిగిన విషయాన్ని వారికి తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ముందుగా కేసు నమోదు చేసిన పోలీసులు న్యాసా చెప్పిన దాన్ని ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 7 People Died : హైదరాబాద్‌లో ఏడుగురు సజీవ దహనం.. ఏమైందంటే ?